కలం, కరీంనగర్ బ్యూరో: ఈనెల 28 ఆదివారం చేవెళ్ల వేంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌కు ఉద్యమకారులు భారీ ఎత్తున తరలిరావాలని “చలో కొడంగల్”కు (Chalo Kodangal) ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గంగిపల్లి సతీష్ పిలుపునిచ్చారు.
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఎలాంటి కాలయాపన చేయకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని, కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి త్వరగా సమర్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 30 కార్లకు తగ్గకుండా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌లో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు, నాయకురాలు తప్పకుండా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
డాక్టర్ సీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఫోరం కృషి ఫలితంగానే కమిటీ ఏర్పాటు జరిగిందని చెప్పారు. కాల పరిమితి లేని కమిటీతో ఉద్యమకారుల జీవితాలతో ఆటలాడుకోవద్దని కోరారు. ఎలాంటి జాప్యం లేకుండా సంప్రదింపులు ప్రారంభించి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో మరో పోరాటానికి ప్రతి ఒక్క ఉద్యమకారులు, నాయకులు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు.
Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!
Follow Us On : WhatsApp

