కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లా మామూనూరులో పాత గోడ కూల్చుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మృతుడు లెనిన్ నగర్‌కు చెందిన సూర యాకయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న మామూనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యాకయ్య మృతితో లెనిన్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

