టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : లా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనే విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ అందించింది. మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధి గల తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET-2026) , అలాగే రెండేళ్ల వ్యవధి గల తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGLCET-2026) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ‌ను రిలీజ్ చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను జూన్ 26న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

షెడ్యూల్ ప్రకారం.. టీజీ లాసెట్‌ – 2026 అభ్యర్థులు జూలై 5 నుంచి 10వ తరగతి తేదీ వరకు ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవచ్చు. జూలై 16 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆపన్ల ఎంపిక,  24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 25 నుంచి 28వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పీజీఎల్‌సెట్‌-2026 అభ్యర్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 27 నుంచి 31వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేయనుండగా.. ఆగస్టు 5న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>