కలం, స్పోర్ట్స్: భారత్ టీ20 జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా మార్పు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఐర్లాండ్‌తో సిరీస్ ప్రారంభానికి ముందు ఆయన ఇన్‌స్టాగ్రామ్ బయోలో చేర్చిన ఒక తేదీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత నెలలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్, జూన్ 26 నుంచి బెల్‌ఫాస్ట్‌లో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలిసారి జట్టును నడిపించనున్నారు.
ఈ కీలక సిరీస్‌కు ముందు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చారు. అందులో “సెకండ్ DOB: 25.12.2025” అని నమోదు చేశారు. దీంతో ఆ తేదీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే దీనిపై శ్రేయస్ (Shreyas Iyer) నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. కానీ ఓ అభిమాని ఆ తేదీ వెనుక ఉన్న కారణాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ మళ్లీ బ్యాట్ పట్టిన రోజు అదే అని పేర్కొన్నాడు.
అది కేవలం క్రికెట్‌లోకి తిరిగి రావడం మాత్రమే కాకుండా, ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు కావచ్చని అభిప్రాయపడ్డాడు. అందుకే ఆ తేదీ ఆయనకు ప్రత్యేకంగా ఉండొచ్చని చెప్పాడు. అలాగే గత కొంతకాలంగా శ్రేయస్ ఆధ్యాత్మికత వైపు మరింతగా మళ్లారని కూడా పేర్కొన్నాడు. ఇక మైదానంలోకి వస్తే, మూడు సంవత్సరాల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టు ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
అయితే ఈ సిరీస్‌లో మరో ప్రధాన ఆకర్షణ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతని దూకుడైన బ్యాటింగ్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చాటింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. చివరిసారిగా 2024 టీ20 ప్రపంచకప్‌లో ఈ జట్లు తలపడ్డాయి.
అలాగే 2007 తర్వాత స్టార్మోంట్ వేదికగా భారత్ మరోసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటికే 14 మ్యాచ్‌ల్లో 12 విజయాలు సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇక శ్రేయస్ బయోలో కనిపించిన ఆ తేదీ వెనుక అసలు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రాలేదు. కానీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌కు ముందు ఆయన చేసిన ఈ చిన్న మార్పు మాత్రం అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది.
Read Also: అదిరిపోయే ఫీచర్లతో రోబోటాక్సీ కారు.. డ్రైవర్ లేకుండానే రయ్ రయ్!
Follow Us On: X(Twitter)

