కలం, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ’పెద్ది(Peddi)‘ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జన్వీ కపూర్ నటిస్తుండటం, పలు భాషల్లో విడుదల కాబోతుండటంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ’చికిరి చికిరి‘ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్ హిట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం టాలీవుడ్‌లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ’పెద్ది‘ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ‘పెద్ది(Peddi)’ షూటింగ్ జరిగింది. హీరో రామ్ చరణ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. చరణ్ సంచి పట్టుకొని ఢిల్లీ నడివీధుల్లో సీరియస్‌గా నడుస్తుండటం, చేతిలో కాగితం పట్టుకొని భారీకెడ్ల దగ్గర నిల్చున్న దృశ్యాలను చూడొచ్చు. ఇందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చరణ్ మాస్ లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.
Read Also: వారణాసి సీక్రెట్ బయటపెట్టిన ప్రియాంకా
Follow Us On: Youtube


