కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వికలాంగుల బడిబాట–2026’ (Vikalangula Badibata 2026) కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) హాజరయ్యారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య, సంక్షేమంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Ramarao Patel) మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు ఉన్న వికలాంగ పిల్లలకు విద్య, వైద్యం, పునరావాస సేవలు అందించడం సమాజ బాధ్యత అని అన్నారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన సహాయ పరికరాలు, వైద్య సేవలు, విద్యా అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రత్యేక పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న ఆయన, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించి వారికి మెరుగైన విద్య అందేలా చూడాలని సూచించారు. విద్య ద్వారానే పిల్లలకు మంచి భవిష్యత్తు నిర్మించవచ్చని అన్నారు. వికలాంగుల పిల్లల పట్ల సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక పాఠశాలల నిర్వాహకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

