కలం, నిర్మల్: ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలని డీఆర్ఓ రాథోడ్ రమేష్ అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్‌లో గురువారం SIR సర్వే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్బంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల వివరాలకు సంబంధించి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ఓటర్లు నింపిన వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారంలు జూలై 24 తేదీ వరకు తిరిగి తీసుకుంటారని తెలిపారు.
వివరాల పరిశీలన తర్వాత SIR కి సంబంధించి, జూలై 31న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో సంబంధిత ఫామ్‌లను నింపి, ధ్రువీకరణ (డిక్లరేషన్) తో ఈఆర్ఓలను సంప్రదించవచ్చని చెప్పారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తెలుపవచ్చని స్పష్టం చేశారు. వివరాల పరిశీలన తర్వాత, అక్టోబర్ 1వ తేదీన తుది ఎలక్టోరల్ రోల్ జాబితా ప్రదర్శిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవిదాస్, అర్బన్ తహశీల్దార్ రాజు, కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ (రప్పు), ఆర్ఐ వెంకటరమణ, బీఎల్ఓలు పాల్గొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

