Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటరు జాబితా సవరణలో ఖచ్చితత్వం పాటించాలి: ఖమ్మం కలెక్టర్

కలం, ఖమ్మం బ్యూరో: ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం (Khammam) నగరం 46వ డివిజన్ పరిధిలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ (Collector Divakara) SIR ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తన వ్యక్తిగత ఎన్యూమరేషన్ ఫారమ్‌ను స్వయంగా నింపి సమర్పించారు. బూత్ స్థాయి అధికారి అందజేసిన ఈ ఫారమ్‌ను పూర్తి చేయడం ద్వారా ఆయన ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించారు.

​అనంతరం ఈ కార్యక్రమంపై బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎన్నికల అధికారులతో కలెక్టర్ (Collector Divakara) సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అర్హత గల ఓటరును గుర్తించి, వారి వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా కచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించడం ద్వారానే అత్యంత పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితాను రూపొందించడం సాధ్యమవుతుందని, అదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>