కలం వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారిందని కేసీఆర్ (KCR)కు కూడా అర్థమైందని, పార్టీని కాపాడుకోవడానికే ఇప్పుడు బయటకు వచ్చాడని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గత రెండేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కండలన్నీ కరిగిపోయాయని, తోలు మాత్రమే మిగిలిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆ ఉన్న తోలును రక్షించుకునేందుకే తోలు తీస్తానంటున్నారని విమర్శించారు.
కేటీఆర్ (KTR) ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అన్నారని, ప్రజలు దీనిపై తీర్పు చెప్పారని వెల్లడించారు. కేటీఆర్, హరీష్ రావు (Harish Rao) చేస్తున్నవి తప్పుడు ఆరోపణలు అని ప్రజలే చెప్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం బీజేపీ (BJP), బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా సాధించలేదన్నారు. దీంతో బీఆర్ఎస్ బలహీనమైపోయిందని కేసీఆర్కు అర్థమైందన్నారు. పార్టీ కోసం తప్ప ఏ ప్రాజెక్టు కోసం కేసీఆర్ బయటకు రాలేదన్నారు.
కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు (Palamuru Project) గురించి మాట్లాడుతున్నారని, 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. పదేళ్ల పాటు పాలించి, రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి చేయలేదని జూపల్లి (Jupally Krishna Rao) విమర్శించారు. పొలాలకు నీళ్లు ఇవ్వాల్సిన కాలువలు కూడా మంజూరు చేయలేదన్నారు.
Read Also: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: Pinterest


