హోస్పేట్‌లో డీకే శివకుమార్‌ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే

కలం, జోగులాంబ గద్వాల: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నదిపై నిర్మించిన తుంగభద్ర జలాశయానికి(హోస్పేట్ డ్యామ్) నూతనంగా అమర్చిన గేట్ల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ గేట్లను అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం‌ నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు.

ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) గురువారం హోస్పేట్‌కు చేరుకున్నారు. అక్కడ కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్‌ను గద్వాల ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గద్వాల ఎమ్మెల్యే వెంట ‌సర్పంచుల‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, గట్టు మాజీ ఎంపీపీ విజయ్ కుమార్‌ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>