కలం వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వరంగల్(Warangal) జిల్లా చెన్నారావుపేటలో ప్రత్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం కలకలం రేపింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దీంతో సర్పంచ్(Sarpanch), ఉప సర్పంచ్(Sub Sarpanch) వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) బలపరిచిన అభ్యర్థి శ్వేత సర్పంచ్‌గా గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా కాంగ్రెస్(Congress) మద్దతుదారు శ్రీనివాస్ విజయం సాధించారు.
నేడు వీరిద్దరూ ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. ఈ వేడుకలో రాజకీయ పార్టీల పాటల విషయంలో తగాదా తలెత్తింది. ఇద్దరివీ వేర్వేరు పార్టీలు కావడంతో పాటల గురించి చిన్నగా ప్రారంభమైన గొడవ కాస్తా పెద్దగా మారింది. దీంతో పరస్పరం ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.
Read Also: పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ బయటకొచ్చాడు – మంత్రి జూపల్లి
Follow Us On: Instagram


