కలం, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీ రాజ్యసభలో నేడు నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు (Rajya Sabha Members) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల రాజ్యసభకు 24 మంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితో రాజ్యసభ ఛాంబర్‌లో రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించనున్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన పార్టీ నుండి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యులు (Rajya Sabha Members) సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్, భాష్యం రామకృష్ణ ప్రమాణం చేయనున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు బీజేపీ పార్టీకి చెందిన వారు ఎన్నికయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 63 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

