Mobile Popup Ad
Mobile Popup Ad

ఉచిత విద్య ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్‌కు వినతి

కలం, కరీంనగర్ బ్యూరో: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో వెంటనే వంద శాతం ఫీజు రాయితీతో ఉచిత విద్య అందించాలని బుధవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాని కలిసి వినతి పత్రం సమర్పించారు. సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్, బీసీ యువజన సంఘం నాయకులు మాదాసు, సంజీవ్ , ఆదర్శ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్యను అందించాలని ఆదేశాలు ఇస్తే అందకనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు మాత్రం పూర్తి స్థాయిలో ఫీజు మాఫీ చేయడం సాధ్యం కాదని చెబుతున్నట్లు వివరించారు. 10 నుంచి 20 శాతం మాత్రమే మాఫీ చేస్తామంటున్నాయని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఎంతైనా అవసరం ఉందని, ఫీజు మాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>