కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ లో నడుస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత (Singer Sunitha) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినీ ఇండస్ట్రీ మహిళలకు కచ్చితంగా సేఫ్ కాదని.. తాను ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ఉమెన్ అయినా కూడా ఈ మాట చెబుతున్నానని ఆమె వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మహిళల శరీరంపై చేతులు వేయడం వంటివి ఈ రోజుల్లో పెద్ద విషయాలే కాదని.. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఇలాంటి సిట్యువేషన్ ఫేస్ చేశానని అన్నారు.
చాలా మంది యువతులు “నా శరీరం నా ఇష్టం” అంటూ ఉంటారని.. అలాగే చూసేవాడి కళ్లు వాడి ఇష్టం అవుతుంది కదా! అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మహిళలు సౌలభ్యంగా ఉంటే ఇష్టమొచ్చిన బట్టలు వేసుకోవచ్చు కానీ.. మహిళలను ఇలానే చూడాలని అవతలి వ్యక్తికి మీరు చెప్పకండి అంటూ అభిప్రాయం వెల్లడించారు. “మీరు అలా చూడొద్దు అంటే ఎవరూ వినరు. అవతలి వ్యక్తి చూపు మార్చడం కంటే, మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం సులభం. మన సంస్కృతికి అనుగుణంగా బట్టలు వేసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చారు.

