Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ ముగ్గురితో సంబంధాలు నిజమే.. బిల్ గేట్స్ సంచలనం!

కలం, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) సంచలన విషయాలను వెల్లడించారు. దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, అణు భౌతిక శాస్త్రవేత్త కరిమా నిగ్మతులీనా, మెడికల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆలిస్ జాకబ్స్ నెస్సెల్‌రోడ్‌లతో తనకు అఫైర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంబంధాల గురించి తెలుసుకున్న ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని బిల్ గేట్స్ కమిటీకి వివరించారు.

ఎప్‌స్టీన్ నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన బిల్ గేట్స్ (Bill Gates).. గతంలో అతనిని కలవడం తాను చేసిన పెద్ద పొరపాటని ఒప్పుకున్నాడు. కేవలం దాతృత్వ కార్యక్రమాలపై చర్చించడానికే అతనిని కలిశానని తెలిపారు. 2013 నాటి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ ఆధారంగా ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించారని తెలిపాడు. ఈ అఫైర్స్ వల్ల తన కుటుంబం మానసిక వేదనను అనుభవించిందన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆసరాగా చేసుకుని ఎప్‌స్టీన్ ప్రయోజనం పొందాలని చూశాడని బిల్ గేట్స్ ఈ సందర్భంగా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>