కలం, వరంగల్ బ్యూరో: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి ప్రియన్షి (18 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నాయనమ్మ నాగమ్మ (65) ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతిచెందారు.
ఒకే కుటుంబంలో వరుసగా ఇద్దరు మృతి చెందడంతో అంబేద్కర్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!
Follow Us On: Instagram

