Mobile Popup Ad
Mobile Popup Ad

ఏం తాగావు రా అయ్యా..! 11kV కరెంట్ తీగల మీద మందుబాబు కునుకు.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్ : మద్యం మనిషిని కోతి చేష్టలు చేసేలా చేయగలదు.. సింహం అంత ధైర్యం నింపగలదు. మత్తులో ఉన్న వ్యక్తి చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూసే ఉంటాం. తాజాగా ఫూటుగా తాగిన ఓ యువకుడు ఏకంగా 11kV పోల్ ఎక్కి తీగల మీద పడుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో జరిగింది. మత్తులో ఉన్న ఆ వ్యక్తి రెండు కరెంట్ వైర్ల మీద అరాంసే పడుకుని సేద తీరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏం తాగావు రా అయ్యా.. ఇంత ధైర్యం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, యువకుడు తీగల మీద పడుకున్నప్పుడు కరెంట్ లేకపోవడంతో బతికిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు యువకుడిని నిలువరించి జాగ్రత్తగా కిందికి దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>