Mobile Popup Ad
Mobile Popup Ad

దేశంలో మరో నిర్భయ తరహా ఘటన.. మహిళ ప్రైవేట్ పార్ట్‌లో వస్తువులు..

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై జరిగిన నిర్భయ తరహా ఘటన బీహార్ (Bihar Gang Rape Case) లో వెలుగులోకి వచ్చింది. మహిళపై ఐదుగురు లైంగికదాడి చేసి మర్మాంగంలో వస్తువులు జొప్పించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. బెగుసారాయ్ కి చెందిన ఓ మహిళ (28) తన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. జూన్ 11 రాత్రి తన ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డిలో ఉండగా ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేశారు. మహిళ చేతులు కట్టేసి, నోటికి గుడ్డ కట్టి దారుణానికి ఒడిగట్టారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా ఛాతీపై బ్లేడ్లతో దాడి చేశారు.

ఈ ఘటన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా, ఆమెపై దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఆమె ప్రైవేట్ భాగాల్లో కొన్ని వస్తువులు జొప్పించినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ఈ అంశం వెలుగులోకి రావడంతో కేసు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. స్పందించిన బేగూసరాయ్ పోలీస్ సూపరింటెండెంట్ మనీష్, బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య నివేదికలో నిర్ధారణ అయినట్లు తెలిపారు.

కేసులో ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఘటన జరిగిన రాత్రి పోలీసులు స్పందించలేదని బాధితురాలు ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>