Mobile Popup Ad
Mobile Popup Ad

సన్న రకాలే సాగు చేయండి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కలం, కరీంనగర్ బ్యూరో: వానాకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న విత్తనాల మాత్రమే సాగు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గత యాసంగి సీజన్‌లో పెద్ద ఎత్తున వరి ధాన్యం, మొక్కజొన్న దిగుబడి వచ్చిందన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసి రికార్డు స్థాయిలో ధాన్యం, మక్కలు కొనుగోలు చేసినట్లు వివరించారు. నాలుగైదు రోజుల లోపు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.

31వ తేదీ వరకు విత్తన మేళా..

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొత్తం పంటను కొనుగోలు చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గొల్లపల్లి మండలం శ్రీరాములుపల్లిలో రూ.70 లక్షలతో పాత కరెంట్ వైర్లు తొలగించినట్లు వివరించారు. గ్రామంలో ఐకేపీ సెంటర్, గ్రౌండ్ ప్రతిపాదనలు తనకు అందాయన్నారు. మిగిలిన సీసీ రోడ్లు సంఘ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. యూరియా యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధిక మొత్తంలో యూరియా వాడటం వల్ల భూసారం తగ్గుతుందన్నారు. దొడ్డు రకాల ధాన్యానికి డిమాండ్ లేదని, సన్న వడ్లు సాగు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ నుంచి 31 వరకు రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>