కలం, సినిమా : సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘తలైవర్ 173’ (Thalaivar 173) నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తాజాగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. “One Name, Forever a Celebration” అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది. ఈ బిగ్గెస్ట్ మూవీ టైటిల్‌ను రేపు ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాణంలో తెరకెక్కుతుండటంతో అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను కమల్ హాసన్, మహేంద్రన్ గ్రాండ్‌గా నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో #Thalaivar173 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. రేపు విడుదలయ్యే టైటిల్‌తో ఈ సినిమాపై మరింత స్పష్టత రానుంది. సూపర్‌స్టార్ అభిమానులు ఈ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: టీమిండియాలోకి కొత్త ఆల్‌రౌండర్.. షెడ్గేకు ఛాన్స్
Follow Us On: Sharechat

