కలం, కరీంనగర్ బ్యూరో: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) దేశం కోసం చేసిన సేవలు, త్యాగం మరువలేనివని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. హుజురాబాద్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ నిర్వహించగా.. గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలనే లక్ష్యంతో అహర్నిశలు పోరాడిన గొప్ప దేశభక్తుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేక రాజ్యాంగం ఉండొద్దని పోరాటం చేస్తూ 1953 జూన్ 23న ఆయన కస్టడీలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. ఆయన కలలు, ఆశయాలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి మోదీ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కో కన్వీనర్ పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, సెంటర్ ఫిలిం బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు, నరాల రాజశేఖర్, తిప్పభతిని రాజు, యాళ్ల సంజీవ రెడ్డి, బోరగాల సారయ్య, కొయ్యడ శ్రీనివాస్, పడారి కొమురయ్య, కొలిపాక వెంకటేష్, గుర్రం సంతోష్, మొలుగూరి నగేష్, మంచికట్ల మురళీ, కొలుగూరి అనిల్, పడారి సుమన్, ఎర్ర శ్రీధర్, బోడిగే రాధ, మోటపోతుల రాకేష్, యాట రాజేష్, నీలం రవీందర్, ఐత సందీప్, క్యాస వెంకటేష్, కొడిమ్యాల పవన్, వోడ్నాల విజయ్, అనంతుల విక్రమ్, పర్థం విజయ్, గంధం సంతోష్, తూర్పాటి అరవింద్ పాల్గొన్నారు.

