కలం, వెబ్ డెస్క్ : Retirement Age – OPS | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 11 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును (Retirement Age) 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని హోంమంత్రి అనిత తన ‘ఎక్స్’ ( ట్విట్టర్) ఖాతాలో తెలిపారు. రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనకు, తద్వారా 35వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. అలాగే ఉండవల్లి మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీకి రూ.130 కోట్లు కేటాయిస్తూ దాదాపు 80కి పైగా అజెండా అంశాలను ఆమోదించడం జరిగిందని వివరించారు.
Read Also: సాయికృష్ణ కేసులో పవన్ కళ్యాణ్‌ను లాగొద్దు: సీఎం చంద్రబాబు
Follow Us On: Instagram

