Mobile Popup Ad
Mobile Popup Ad

పీవోకే ఎప్పటికీ మాదే.. పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ (India) సొంతమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ఇండియాతో యుద్ధానికి సిద్ధమంటూ పీవోకేపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా చేసిన దురుసు వ్యాఖ్యలను ఖండించింది. తమ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన బయటకు రాకుండా ఉండేందుకే దాయాది దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ విమర్శించారు. దశాబ్దాల కాలంగా పీవోకే ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తూ వస్తున్న పాకిస్థాన్.. అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందన్నారు.

పీవోకే (POK) ప్రజలపై అధికారులు బలవంతపు ప్రయోగానికి కూడా దిగుతున్నారని, నిరసనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో అనేక మంది మరణించినట్లు తమకు సమాచారం అందుతోందని, పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రజలకు నిత్యావసరాలు, ట్యాబ్లెట్ల వంటివి కూడా అందకుండా క్రూర చర్యలకు పాల్పడుతోందన్నారు. తరచూ ఇంటర్నెట్ కనెక్షన్ ఆపేస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి పాక్ మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించాలని కోరారు.

ఖతార్ దుర్ఘటనపై స్పందన..

ఖతార్ రస్ లఫాన్ ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్లు రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. భారీ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని.. వివిధ దేశాలకు చెందిన 66 మంది గాయపడినట్లు వివరించారు. వీరిలో ఎంత మంది భారతీయులు ఉన్నారనేది ఇంకా తెలియరావడం లేదని, అక్కడి ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

Read Also: విదేశీ నిధుల నియంత్రణలో భారీ మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>