Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎటువంటి తప్పులు, లోటుపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) బూత్ లెవల్ అధికారులకు సూచించారు.

మంగళవారం హన్వాడ (Hanwada) మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌వో ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె (Collector Khushboo Gupta) మాట్లాడుతూ.. ప్రతి BLO తనకు కేటాయించిన పోలింగ్ కేంద్ర పరిధిలోని ప్రతి ఇంటిని జూన్ 25 నుండి జూలై 24 వరకు సందర్శించి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి వారి వివరాలను సేకరించాలని తెలిపారు.

ప్రతి ఫారంపై ఓటరు తాజా ఫొటోను తప్పనిసరిగా అతికించాలని సూచించారు. ఓటర్ల వివరాలను సేకరించే సమయంలో వాటిని కచ్చితత్వంతో నమోదు చేయాలని, ఓటర్ల మ్యాపింగ్‌ను కూడా సక్రమంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 2002 ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాతో పోల్చి వివరాలను పరిశీలించాలని, ఏవైనా వ్యత్యాసాలు గుర్తించినట్లయితే సంబంధిత ధ్రువపత్రాలను సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సవరణలు చేపట్టాలని చెప్పారు.

పాత, కొత్త ఓటరు జాబితాల మధ్య మిస్‌మ్యాచింగ్ కారణంగా ఆన్‌లైన్ ద్వారా నోటీసులు వచ్చిన వెంటనే సంబంధిత ఓటర్లకు వాటిని అందజేసి, అవసరమైన పత్రాలను సేకరించి వివరాలను నవీకరించాలని సూచించారు. మరణించిన, శాశ్వతంగా వెళ్ళిపోయిన, ఓటర్లను తొలగించే ముందు నోటీసులు ఇచ్చి భారత ఎన్నికల కమిషన్ నిర్దేశాలను అనుసరించి మాత్రమే చేయాలని, ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు ఓటు హక్కు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. హన్వాడ మండలంలో 48 పోలింగ్ కేంద్రాలకు 48 మంది బూత్ లెవల్ అధికారులను నియమించినట్లు మండల తహసీల్దార్ కిస్ట్యా నాయక్ కలెక్టర్‌కు వివరించారు.

SIR ప్రక్రియపై BLOలకు సమగ్ర శిక్షణ ఇచ్చి, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఓటర్ల పేర్లలో, అక్షరదోషాల్లో, ఇంటి చిరునామాల్లో తదితర వివరాల్లో మార్పులు అవసరమైన సందర్భాల్లో సరైన ధ్రువపత్రాల ఆధారంగా మాత్రమే సవరణలు చేపట్టాలని, ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ కిష్టా నాయక్, ఎంపిడిఓ యశోదమ్మ, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

Read Also: పీవోకే ఎప్పటికీ మాదే.. పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>