Mobile Popup Ad
Mobile Popup Ad

సాయి కృష్ణ మిస్సింగ్​ కేసులో కీలక పరిణామం!

క‌లం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ మిస్సింగ్​ కేసు (Sai Krishna Missing Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్​ అయిన సీఐ నాగరాజు (CI Nagaraju)ను సిట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. విజయవాడలోని సింగ్​ నగర్​లో ఉన్న సీఐ నాగరాజు ఇంటి వద్ద ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగరాజును ఏ క్షణమైనా అరెస్ట్​ చేయొచ్చన్న వార్తలతో ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫ్లెక్సీలు పట్టుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు, సిట్​ అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. నాగరాజును అరెస్ట్ చేయొద్దని, నిజాయితీ గల ఆఫీసర్లు తమకు కావాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి ఇంట్లోకి వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. సిట్​ బృందం ఆయనను స్టేట్​ పోలీస్​ గెస్ట్​ హౌస్​కు తరలించి విచారించనుంది. ​

మ‌రోవైపు ఈ కేసుకు సంబంధించి కృష్ణ లంక పోలీస్ స్టేష‌న్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను భ‌ద్ర‌ప‌ర్చాల‌ని కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. సిట్ విచార‌ణ‌లో మే 1 నుంచి దాదాపు నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ మాయ‌మైన‌ట్లు తేలింది. కేవ‌లం రెండు రోజుల ఫుటేజ్ మాత్ర‌మే ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ కేసులో ఆధారాలు నాశ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని సిట్ అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>