Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో సీఎం రేవంత్ భేటీ

క‌లం, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజర‌య్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు, దానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణం పొందే అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇదే విష‌య‌మై సోమ‌వారం రాత్రి సీఎం రేవంత్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌తో భేటీ అయ్యారు. సీఎం చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైతే మెట్రో ఫేజ్‌-II అడ్డంకులు తొల‌గ‌నున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>