Mobile Popup Ad
Mobile Popup Ad

అమీన్‌పూర్‌లో భారీ వర్షం.. నీట మునిగిన అపార్ట్‌మెంట్లు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్ (Ameenpur) డివిజన్‌లో సోమ‌వారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలకు వరద నీరు పోటెత్తింది. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో పలు అపార్ట్‌మెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రాఘవేంద్ర కాలనీలోని పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.

మోకాళ్ల లోతుకు పైగా నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ మోటార్ల సహాయంతో సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు తోడేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షపు నీరు ఒక్కసారిగా సెల్లార్లలోకి దూసుకురావడంతో, అక్కడ పార్కింగ్ చేసి ఉన్న మోటారు వాహనాలు, కార్లు పూర్తిగా నీట మునిగాయి. ఇంజన్లలోకి నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. వాహనాలు పాడైపోవడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>