యూరియా యాప్.. ఎరువుల కోసం రైతు ఆత్మహత్యాయత్నం

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో యూరియా యాప్ వ్యవహారం ప్రాణాల మీదకు తెచ్చింది. యూరియా కోసం ఓ రైతు ఆత్మహత్యయత్నానికి (Farmer Attempts Suicide) పాల్పడ్డాడు. రాజంపేట సొసైటీ వద్ద యూరియా కోసం కమ్మరి వెంకటి అనే రైతు వచ్చాడు. అతని చేతిలో పెట్రోల్ డబ్బా కనిపించడంతో అంతా టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలోనే యూరియా దొరకడం లేదని ఆ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, తోటి రైతులు అతన్ని అడ్డుకున్నారు. ఆన్‌లైన్‌లో ఉంచిన యూరియా బుకింగ్ అయిపోవడంతో మనోవేదనకు గురైన రైతు ఇలా పెట్రోల్ డబ్బాతో రావాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. రైతుకు ఏమీ కాకపోవడంతో పోలీసులు, రైతులు సొసైటీ వారు అంతా ఊపిరి పీల్చుకున్నారు. యూరియా యాప్‌ను వెంటనే తొలగించి పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>