కలం, వెబ్ డెస్క్: ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘బెస్ట్ అవైలబుల్ స్కీమ్’ను నిర్మల్ (Nirmal) జిల్లాలో కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు తొలగించాయని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ పథకంలో కొనసాగుతున్న విజయ, రవి హైస్కూళ్ల యాజమాన్యాలు వైదొలగడాన్ని ఖండించారు. ఇలాగే ప్రతి పాఠశాల స్కీమ్ నుంచి బయటకొస్తే పేద ఎస్సీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద ఎస్సీ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటుల్ల వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం, కొంతం మురళీధర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

