పరిశ్రమల్లో స్థానికులకే మొదటి ప్రాధాన్యత: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్కులోని పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాల కల్పనలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) కోరారు. సోమవారం మెడికల్ డివైస్ పార్కులోని ఐలా కార్యాలయంలో పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పార్క్‌లో ప్రస్తుతం 120 పరిశ్రమలున్నాయని, స్థానికులకు ఎక్కువ శాతం ఉద్యోగాలివ్వాలని సూచించారు. రిక్రూట్మెంట్ సమయంలో వివిధ మాధ్యమాల ద్వారా స్థానికులకు సమాచారం అందించాలన్నారు. అంతేగాకుండా, పరిశ్రమలు తమ సీఆర్ఎస్ నిధులను పూర్తిగా స్థానిక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>