Mobile Popup Ad
Mobile Popup Ad

మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సహజ చిట్కాలు ట్రై చేయండి

కలం, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో యువతులను ఎక్కువగా వేధిస్తున్న చర్మ సమస్యల్లో మొటిమలు ప్రధానమైనవి. ముఖంపై వచ్చే ఈ మొటిమలను తగ్గించుకోవడానికి అమ్మాయిలు మార్కెట్లో దొరికే రకరకాల రసాయన క్రీములను వాడుతుంటారు. అయితే, వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన వస్తువులతో, చిన్న చిన్న చిట్కాల ద్వారా మొటిమల సమస్యకు (Pimple Removal Tips) శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐస్‌క్యూబ్స్‌‌తో..

కొన్నిసార్లు మొటిమలు పెద్ద దద్దుర్ల మాదిరిగా వచ్చి చాలా నొప్పిని కలిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఐస్‌క్యూబ్స్‌తో వాటిమీద అద్దితే కాస్త ఉపశనమనం కలుగుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వాపు కూడా తగ్గుతుందట.

తేనే, పసుపు మిశ్రమం

ఒక బౌల్‌లో చెంచా పసుపు వేసుకోవాలి. దీనిలో అర చెంచా తేనె వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపైన చిన్న చుక్కలా ఉంచి అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజులపాటు చేస్తే మొటిమలు తగ్గుతాయి.

వేపాకు పేస్ట్‌తో..

వేపాకులను శుభ్రంగా కడిగి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన మొటిమల సమస్య తీరుతుంది.

ముల్తానీ మట్టితో..

మొటిమలను తగ్గించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనికోసం ఒక బౌల్‌లో రెండు చెంచాల ముల్తానీ మట్టిని తీసుకోవాలి. అందులో తగినన్ని గులాబీ నీళ్లు చిలకరించి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. ఆ తరువాత మంచినీళ్లతో శుభ్రం చేసుకుంటే మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు తగ్గుతాయట.

కలబంద గుజ్జుతో..

మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు రాత్రి పడుకునేముందు మొటిమలపై కలబంద గుజ్జు రాయాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

టీ ట్రీ ఆయిల్‌తో..

ఒక స్పూన్ కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ కలిపాలి. దీన్ని మొటిమలపైన రాస్తే నొప్పి, వాపు తగ్గుతాయట.

గ్రీన్‌ టీ డికాషన్‌

మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి తరచూ తేనె లేదా గ్రీన్‌ టీ డికాషన్‌ అప్లయ్‌ చేస్తుండాలి. దీనివల్ల చర్మంపై సెబమ్‌ ఉత్పత్తి తగ్గి మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌

మంచి నీళ్లు, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గుతాయని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>