Mobile Popup Ad
Mobile Popup Ad

చొప్పదండి కుడి చెరువు కట్టపై అగ్ని ప్రమాదం.. తాటి చెట్లు దగ్ధం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండి (Choppadandi) పట్టణంలోని కుడి చెరువు కట్టపై అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కట్ట సమీపంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ లేదా బీడీ కాల్చి పడేయడంతో గాలి తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించాయి. కట్టను ఆనుకొని ఉన్న దాదాపు 20కి పైగా తాటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ మంటల గాలికి అగ్గి రవ్వలు సమీపంలోని ఇండ్లలోకి ఎగిరి పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

గమనించిన స్థానికులు వెంటనే వార్డు కౌన్సిలర్, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య దృష్టికి తీసుకెళ్లడంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వలన పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>