కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో భారీ ఆభరణాల చోరీ (Gold Theft )వెలుగు చూసింది. పలువురు జ్యువెలరీ షాప్ యజమానులను బురిడీ కొట్టించిన ఓ వ్యక్తి ఏకంగా 13 కిలోల బంగారు ఆభరణాలను కాజేసి పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నితిన్ అనే వ్యక్తి పలువురు జ్యువెలరీ షాప్ యజమానులతో తనకు సంబంధాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని నవ్య, సిద్ధి వినాయక, బన్సీలాల్, శ్యాంబాబా జ్యువెలర్స్ యజమానులకు పరిచయం చేసుకున్నాడు. నితిన్‌ను నమ్మిన సదరు జ్యువెలరీ షాప్ ఓనర్స్ వ్యాపారంలో భాగంగా అతడికి 13 కిలోల బంగారు ఆభరణాలు అప్పగించారు. తర్వాత నితిన్ చేసిన మోసాన్ని గ్రహించారు. నలుగురు జ్యువెలరీ షాప్ యజమానులు సీసీఎస్ పోలీసులకు నితిన్‌పై ఫిర్యాదు చేశారు. నితిన్‌కు అప్పగించిన బంగారం విలువ సుమారు రూ.21 కోట్ల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

