బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా..

కలం, వెబ్ డెస్క్ : యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లేబర్ పార్టీని (Labour Party) తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. దేశాన్ని పునర్నిర్మించాలనే హామీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్, ఇటీవల తన ప్రజాదరణ తీవ్రంగా పడిపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

పార్టీ అంతర్గతంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టార్మర్ నాయకత్వంలో లేబర్ పార్టీ భారీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలలో  అసంతృప్తికి దారితీశాయి. దీనితో స్టార్మర్‌పై నమ్మకం తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్మర్ రాజీనామాతో బ్రిటన్ రాజకీయాలలో అనిశ్చితి నెలకొంది. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. లేబర్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>