Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ సీఎస్​తో SBI బృందం భేటీ!

క‌లం, వెబ్ డెస్క్: తెలంగాణ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు (Telangana CS Ramakrishna Rao) స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (SBI) బృందంతో నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయదుర్గం భూముల కేసులపై చర్చించారు. అలాగే ఎస్బీఐ లావాదేవీలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఎస్బీఐ తీరుపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ, ప్రధానికి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్బీఐ లేవనేత్తిన పలు అంశాలను సీఎస్ రామకృష్ణా రావు నివేదిక రూపంలో సిద్ధం చేసుకున్నారు. సమావేశం అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ వైఖరిని సీఎస్ కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>