కలం, వెబ్ డెస్క్: అదృష్టం ఎప్పుడు, ఎవర్ని, ఎలా వరిస్తుందో తెలియదు. ఒక్కోసారి ఒక్క నిమిషంలోనే జీవితం ఎవరూ ఊహించని విధంగా మారిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో జరిగింది. సాధారణ జీవితం గడిపే ఓ ట్యాక్సీ డ్రైవర్ (Taxi Driver)ను లాటరీ (Lottery) రూపంలో అదృష్టం వరించి కోటీశ్వరుడ్ని చేసింది. వివరాల్లోకి వెళ్తే… హిమాచల్‌కు చెందిన కల్యాణ్ చంద్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇటీవల ఆయన ఒక ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్ Punjab)లోని బఠిండాకు కారులో వెళ్లాడు. ప్రయాణికుడిని డ్రాప్ చేసిన తర్వాత అక్కడ ఓ దుకాణంలో లాటరీలు అమ్ముతుండటాన్ని గమనించాడు.
పంజాబ్‌లో లాటరీలు చాలా ఫేమస్. చాలామంది కొనడం గమనించి రూ.500లకు ఒకటి చొప్పుతున్న అమ్ముతున్న ఆ లాటరీని కల్యాణ్ చంద్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. తాను తిరిగొచ్చిన కొద్ది రోజులకు లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు చూసిన కల్యాణ్ చంద్ షాకయ్యాడు. ఆయనకు ఏకంగా ఫస్ట్ ప్రైజ్ కింద రూ.3 కోట్లు లభించినట్లు తెలుసుకున్నాడు. ట్యాక్సీ నడిపితే వచ్చే ఆదాయంతో బతుకుతున్న ఆ కుంటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి బంధువులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లాటరీతో కల్యాణ్ చంద్ ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ లాటరీ జాక్‌పాట్ హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేమంటూ నెటిజన్లు కల్యాణ్ అదృష్టంపై చర్చించుకుంటున్నారు.

