కలం, వెబ్ డెస్క్: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు (Sandhya Theatre Case)లో చార్జిషీట్‌ను పరిగణిలోకి తీసుకున్న నాంపల్లి కోర్ట్ (Nampally Court) నేడు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఏ11గా ఉన్న స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన వర్చువల్‌గా హాజరవుతానని కోర్టును కోరారు. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది. అల్లు అర్జున్ మినహా నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జూలై 6కు వాయిదా వేసింది. జూలై 6న సైతం వర్చువల్‌గానే హాజరవుతానని అల్లు అర్జున్ కోరారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.

