బాక్సాఫీస్ ‘నేషనల్ క్రష్’.. రష్మిక కెరీర్‌ను మార్చేసిన 10 సినిమాలివే!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత హీరోయిన్లలో రష్మిక మందన్న (Rashmika Mandanna) క్రేజ్ వేరు. ఒకవైపు కథా బలమున్నా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. భారీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని పరిశ్రమల్లోనూ హిట్స్ కొట్టి దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా సెన్సేషన్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. భాషలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆమె ప్రత్యేక శైలి డిమాండ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా ఆమెను నిలబెట్టింది.

కేవలం కమర్షియల్ హిట్లకు మాత్రమే పరిమితం కాకుండా, భీష్మ, డియర్ కామ్రేడ్, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించింది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్లతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలలోనూ తాను రాణించగలనని నిరూపించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నా రష్మికకు (Rashmika Mandanna) చేతినిండా సినిమాలున్నాయి.

రష్మిక కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ సినిమాలివే..

  • పుష్ప 2: రూ. 1,871 కోట్లు
  • యానిమల్: రూ. 917 కోట్లు
  • ఛావా: రూ. 807 కోట్లు
  • పుష్ప 1: రూ. 368 కోట్లు
  • వారిసు: రూ. 306 కోట్లు
  • సరిలేరు నీకెవ్వరు: రూ. 260 కోట్లు
  • థామ: రూ. 187 కోట్లు
  • కుబేర: రూ. 138 కోట్లు
  • గీత గోవిందం: రూ. 130 కోట్లు
  • సీతారామం: రూ. 100 కోట్లు
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>