Mobile Popup Ad
Mobile Popup Ad

టాక్సిక్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

క‌లం, వెబ్ డెస్క్: కేజీఎఫ్ స్టార్ య‌శ్ (Yash) హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్‌. గీతూ మోహ‌న్ దాస్ డైరెక్ష‌న్‌లో రూపు దిద్దుకున్న ఈ మూవీ విడుద‌ల తేదీ (Toxic Release Date) ఖారారైంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు వాయిదాల అనంత‌రం ఆగ‌స్టు 26న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ టీం అధికారికంగా ప్ర‌క‌టించింది. కెవిన్ ప్రొడక్షన్స్ బ్యానన్‌రో వ‌స్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీలో య‌శ్ రెండు విభిన్న క్యారెక్ట‌ర్‌ల‌లో న‌టిస్తుండ‌టం ఆస‌క్తిని పెంచేసింది.

ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఓనం, ఈద్, రక్షా బంధన్ వంటి పండుగ‌లు ఉండ‌టంతో వరుస సెల‌వులు క‌లిసి రానున్నాయి. అలా లాంగ్ వీకెండ్ పండగ సీజన్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడానికి మేకర్స్‌కు ఒక గొప్ప అవకాశంగా మారనుంది. డైరెక్ట‌ర్ గీతూ ఈ సినిమా కథ గురించి ఎక్కడా లీక్ చేయకుండా, కేవలం పోస్టర్లతోనే ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. పోస్ట‌ర్లు, టీజ‌ర్ల‌లో య‌శ్ కేజీఎఫ్‌ను మించి ఫుల్ వైలంట్‌గా క‌నిపిస్తున్నారు. భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న ఈ సినిమా య‌శ్‌కు కేజీఎఫ్‌ను మించి భారీ విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Also: మీ అందాన్ని దెబ్బతీసే సాధారణ పొరపాట్లు ఇవే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>