కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన సీట్ చోరీకి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ కూడా కాంప్రమైజ్ అయిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆరోపించారు. నేడు గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. రాజ్యసభ తిరస్కరణ విషయం లో తాము నిరాశ చెందలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఓటు చోరీ, సీట్ చోరీకి పాల్పడుతుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండేళ్ల నుంచి చెప్తున్నారని.. తన సీటు చోరీతో బీజేపీ కుతంత్రాన్ని ప్రజలకు చూపించామని పేర్కొన్నారు.
కుంభం శివ కుమార్ (Kumbham Shiva Kumar) ఇష్యూ లో కేసు సీరియస్ అని గ్రహించి ఆయనకు నారాయణపేట టికెట్ ఇవ్వలేదని మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) స్పష్టం చేశారు. అయితే కుంభం శివ కుమార్ పై ఎలాంటి కేసు ప్రూవ్ కాలేదు, ఛార్జ్ షీట్ లేదని చెప్పారు. తనపై క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ లో ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు తమకు చెప్పిందని అన్నారు. కానీ తన నామినేషన్ ను ఎలక్షన్ కమిషనే రిజెక్ట్ చేసిందని.. ఇదంతా గమనిస్తుంటే తన ఇష్యూలో ఎన్నికల కమిషన్ కాంప్రమైజ్ అయినట్లు స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!
Follow Us On : WhatsApp

