Mobile Popup Ad
Mobile Popup Ad

ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి : బిఆర్ఎస్వి

కలం, యాదగిరిగుట్ట : ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ యాదగిరిగుట్ట ఎంఈఓ కార్యాలయంలో బిఆర్ఎస్వి (BRSV) మండల అధ్యక్షుడు ఓగ్గు మల్లేష్ వినతి పత్రం సమర్పించారు. విద్యా హక్కు చట్టం అమలు చేయడంతో పాటు అనుమతులు లేని విద్యా సంస్థలను మూసివేయాలని వినతిలో పేర్కొన్నారు.

పాఠశాలలో స్టేషనరీ వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని స్కూల్ ఫీజులతో సహా స్టేషనరీ దందాలతో అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు దర్శనం విజయ్ కుమార్, కర్రే చంద్రశేఖర్, మోటే శేఖర్, ఆతుకూరి ఐలేష్, కదూరి కరుణాకర్, గోపి వంశి, మోటే సురేష్, కర్రె మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>