మహారాష్ట్ర రాజకీయాల్లో కల్లోలం.. చీలిక దిశగా మరో పార్టీ!

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఇప్పటికే శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ – ఎస్పీ లో కూడా చీలికలు రాబోతున్నాయనే విషయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) తీవ్ర కల్లలోం సృష్టిస్తోంది. ఈ మేరకు శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీ (NCP) కు చెందిన సీనియర్ నేత బాబా ధర్మారావు ఆత్రం తెలిపారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు.

అయితే లోక్ సభలో ఎన్సీపీ – ఎస్పీ కి మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఎవరూ కూడా పార్టీలో చీలికపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలాఉంటే అనర్హత వేటు నుంచి తప్పించుకొని పార్లమెంటరీ పార్టీలో చీలిక జరగాలంటే .. లోక్ సభలో ఆరుగులు ఎంపీలు ఒకేతాటిపైకి రావాల్సి ఉంటుంది. ఈ విషయంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది. కాగా, ఉద్ధవ్‌ ‌థాక్రే నేతృత్వంలో శివసేన (యూబీటీ) కు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఏక్‌‌నాథ్‌ ‌షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే తాము షిండే శివసేనలో విలీనం కావాలని నిర్ణయించినందున లోక్ సభలో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి వారు లేఖ పంపినట్లు సమాచారం అందుతోంది.

Read Also: ప్రధాని మోదీకి సీజేపీ బహిరంగ లేఖ.. రేపటి నుంచి భారీ నిరసన!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>