తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

కలం, వెబ్ డెస్క్: తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం దర్శించుకుంది. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రముఖ నటి సమంత (Samantha), దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి శ్రీముఖి (Sreemukhi), దర్శకురాలు నందిని రెడ్డి కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ చిత్రబృందానికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఘన విజయం సాధించాలని టీం తిరుమల శ్రీవారిని కోరుకుంది.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>