ఏపీలో కొత్తగా వారందరికి పింఛన్లు .. మంత్రి ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో వితంతు పెన్షన్ల పంపిణీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలోనే వింతతు కేటగిరీ పింఛన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వింతతు ఫించన్లకు కొత్తగా 2.20 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. వింతతు ఫించన్లకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. రానున్న ఒకట్రెండు నెలల్లో కొత్త వింతతు పింఛన్లను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. వారందరికి నెలకు రూ.4000 చొప్పున పింఛన్ ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పింఛన్లు (Pensions) తొలగించారని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) ఫైర్ అయ్యారు. దేశంలోనే ఏపీలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9.56 లక్షల మంది పింఛన్లను తొలగించారని, అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 7,856 పింఛన్లను అనర్హుల కేటగిరీలో తొలగించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని, ఇందుకు ఏటా రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

Read Also: డీఎస్సీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. జ‌గ‌న్‌కు లోకేశ్ స‌వాల్‌

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>