ఉస్మానియాలో ర్యాగింగ్ క‌ల‌క‌లం.. 12 మందిపై కేసు!

క‌లం, వెబ్ డెస్క్: ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ (Osmania Medical College)లో మ‌రోసారి సీనియ‌ర్ల‌ ర్యాగింగ్ క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థుల‌ను ర్యాగింగ్ చేశార‌న్న ఆరోప‌ణ‌లతో 12 మంది సీనియ‌ర్ల‌పై కేసు న‌మోదైంది. వివరాల్లోకి వెళ్తే.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చ‌దువుతున్న ప‌లువురు విద్యార్థుల‌ను ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు కొద్ది రోజులుగా ర్యాగింగ్ చేస్తున్నారు.

సీనియ‌ర్ల ఆగ‌డాలు హ‌ద్దులు దాటుతుండ‌టంతో విద్యార్థులు ఈ విష‌యాన్ని ప్రిన్సిప‌ల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్‌ యాదవ్‌ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బ‌జార్ పోలీసులు తెలంగాణ‌ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మ‌రోవైపు కాలేజీ (Osmania Medical College) యాజమాన్యం ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల‌ను ఆరు నెల‌ల పాటు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: ప్రభుత్వ బడి నుంచే సీఎం స్థాయికి.. ఆరుట్ల సభలో రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>