సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. నేలపైనే గర్భిణులు నిరీక్షణ

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) ప్రభుత్వాస్పత్రిలో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు (Pregnant Women) కనీస సౌకర్యాలు కల్పించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య పరీక్షలు, ఇతర టెస్టుల కోసం వచ్చేవారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఆస్పత్రి ఆవరణలోనే నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎక్కువ సమయం నేలపై కూర్చోవడం వల్ల నొప్పులు అధికమవుతున్నాయి. కుర్చీలు ఏర్పాటు చేయకపోవడం దారుణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి, కనీస వసతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే గర్భిణులకు ప్రత్యేక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>