కలం, వెబ్ డెస్క్ : సిరి గోల్డ్ పేరుతో భారీ మోసం (Gold Fraud ) బయటపడింది. రెండు రాష్ట్రాల్లో గోల్డ్ పెట్టుబడుల పేరుతో పెద్ద మొత్తం వసూళు చేసి చిబాణా ఎత్తేశాడని బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూసంపూడి రవీంద్ర పెట్టుబడుల పెడితే లాభాలు వస్తాయని చెప్పి ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా వేల మంది నుంచి పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నట్లు సీసీఎస్(CCS) కు ఫిర్యాదు అందింది. బంగారంతో చిన్నచిన్న మొత్తంలో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. దీంతో కోసంపూడి రవీంద్ర(Kusampudi Ravindra) పై జీరో ఎఫ్ఐర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
Read Also: మెస్సీకి రూ.89 కోట్ల ఫీజు.. బయట పెట్టిన నిర్వాహకుడు
Follow Us On: Youtube


