కలం, వెబ్ డెస్క్ : Peddi – The Paradise | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీతో ది ప్యారడైజ్ గట్టి పోటీ పడుతోంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ షూటింగ్ స్పీడ్ గానే జరుగుతోంది. ఈ రెండు సినిమాలు 26 మార్చి 2026న రిలీజ్ కాబోతున్నాయి. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. పైగా రెండూ డిఫరెంట్ స్టోరీలతో వస్తున్నాయి. రెండూ పాతకాలం కథలతోనే వస్తున్నాయి. కాబట్టి అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే పెద్ది సినిమాతోనే ది ప్యారడైజ్ పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. పెద్ది నుంచి అప్డేట్లు వచ్చిన టైమ్ లోనే ప్యారడైజ్ నుంచి ఏదో ఒక అప్డేట్ లేదా పోస్టర్ లాంటివి వదులుతున్నారు మూవీ మేకర్స్.
Peddi – The Paradise | ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు సినిమాల డైరెక్టర్లకు రెండో సినిమాలే కావడం విశేషం. పైగా బుచ్చిబాబు, శ్రీకాంత్ ఇద్దరూ సుకుమార్ శిష్యులే. పెద్ది నుంచి శివరాజ్ కుమార్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు. అంతకు ముందు జాన్వీకపూర్ లుక్ రిలీజ్ అయినప్పుడు ప్యారడైజ్ నుంచి ఓ పోస్టర్ వదిలారు. మొన్న రామ్ చరణ్ ఛాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పెద్ది రిలీజ్ డేట్ చెప్పడంతో.. వెంటనే సంపూర్ణేష్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేసింది ప్యారడైజ్ టీమ్. ఇందులో రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేశారు. అంటే పెద్దితో ప్రమోషన్లలో సమానంగా ఉండాలని ప్యారడైజ్ భావిస్తుందేమో అంటున్నారు కామన్ ఆడియెన్స్. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ వరకు ఇంకెంత పోటీ పడుతాయో వెయిట్ చేయాలి.
Read Also: భయపెడుతున్న ‘ఈషా’ స్పెషల్ వార్నింగ్ వీడియో!
Follow Us On: Sharechat


