కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ అయిపోయేందుకు కొందరు ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ పిచ్చిలో బలవుతున్నారు. ప్రాణాలుపోతున్నా రీల్స్ పిచ్చి తగ్గడం లేదు. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ఫేమస్ అయిపోయేందుకు స్టంట్‌లు చేస్తూ కనిపించాడు. ఢిల్లీ- లఖ్ నపూ(Delhi – Lakhanpur) హైవేపై ఉన్న రైల్వే వంతెన అంచును పట్టుకొని పుల్ అప్స్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేసే వారివల్ల వారితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రీల్స్ సరదాతో కొందరు చేసే పనులు.. ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. తమలోని ప్రతిభను రోజురోజుకి బయట ప్రపంచానికి తాపత్రయపడుతున్నారు. అనంతరం అది కాస్తా పిచ్చిగా మారి, వికృత చేష్టలకు పరాకాష్టగా మారుతోంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం. రీల్స్ చేస్తున్నామనే భ్రమలో పడిన వారు, ప్రమాదం అంచున ఉన్నామనే విషయాన్నే మర్చిపోయి ప్రాణాలు కోల్పోతూ, కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: Instagram


