epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇమ్రాన్​ ఖాన్​ కు మరో 17 ఏళ్ల జైలు శిక్ష

కలం, వెబ్​ డెస్క్​ : పాకిస్తాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కు (Imran Khan) మరో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషాకానా2(Toshakhana Case) అవినీతి కేసులో ఫెడరల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్​ తో పాటు అతని భార్యకు కూడా జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, 2021లో సౌదీ ప్రభుత్వం అందజేసిన కానుకలను ఇమ్రాన్​ ఖాన్​ తక్కువ ధరలకు అమ్ముకున్నట్లు అభియోగాలతో కేసు నమోదయింది. సౌది చక్రవర్తి ఇచ్చిన 7.15 కోట్ల పాకిస్తాన్ రూపాలయల విలువైన నగలను 50 లక్షలకే అమ్ముకున్నారని దర్యాప్తులో వెల్లడైంది.

అయితే, ఇమ్రాన్​ మాత్రం రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని కోర్టులో వాదించారు. ప్రస్తుతం కేసు విచారణ పూర్తవడంతో స్పెషల్​ కోర్టు జడ్జీ షారుఖ్​ అర్జుమంద్​ తీర్పును వెలువరించారు. కోర్టు ఇమ్రాన్​ ఖాన్​ చర్యను ప్రభుత్వ విశ్వాసఘాతుక చర్య, అత్యంత అవినీతిమయమైన చర్యగా పేర్కొంది. పాక్​ శిక్షా స్మృతి ప్రకారం.. ఇమ్రాన్​ ఖాన్​.. ఆయన భార్య బుష్రాకు (Bushra Bibi) కోర్టు పదేళ్ల శిక్ష విధించగా.. అవినీతి చట్టం కింద మరో ఏడేళ్ల జైలు శిక్ష వేశారు. అలాగే వారికి ఒక్కొక్కరిపపై 10 మిలియన్​ డాలర్ల జరిమానా కూడా విధించారు.

కాగా, స్పెషల్​ కోర్టు తీర్పును హై కోర్టులో సవాల్​ చేయనున్నట్లు ఇమ్రాన్​, బుష్రా లీగల్​ బృందాలు తెలిపాయి. ఇప్పటికే ఇమ్రాన్​ 14 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తోషాకానా2 కేసులో ఇమ్రాన్​ ఖాన్ దంపతులకు జైలు శిక్ష తీర్పు రాగానే పాకిస్తాన్​ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. పీటీఐ పార్టీ నేతలు, ఇమ్రాన్​ (Imran Khan) మద్ధతుదారులు ఆందోళనకు దిగారు.

Read Also: జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా ఏపీ : చంద్రబాబు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>